అధికారుల నిర్లక్ష్యంతో నాయకుల ఆశయం అబాసుపాలు..

by Disha Web Desk 18 |
అధికారుల నిర్లక్ష్యంతో నాయకుల ఆశయం అబాసుపాలు..
X

దిశ ప్రతినిధి, విజయవాడ : నందిగామ గాంధీ సెంటర్లో మెయింటెనెన్స్ లేని గాంధీ విగ్రహం. దుమ్ము ధూళితో నిండిపోయిన విగ్రహం.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రజలు ఆగ్రహం.నందిగామ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గాంధీ సెంటర్లోని గాంధీ విగ్రహం ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఏరియాని బట్టి పేరు ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి విశాఖ ఆర్కే బీచ్ విజయవాడ పిడబ్ల్యు గ్రౌండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఇలా ప్రత్యేకమైన ప్లేసుల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అదేవిధంగా నందిగామకు నడిబొడ్డు గాంధీ సెంటర్ ఆ సెంటర్లో గతంలో చిన్న విగ్రహం ఉండేది. కానీ గాంధీ గారు అంటే ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరుంది. అలాంటి మహాత్ముడికి నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆ సెంటర్లో ఒక ప్రత్యేకంగా ఉండాలని ఉద్దేశంతో గాంధీ విగ్రహాన్ని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశారు.

దానికి విగ్రహం వెనుక వైపు మన జాతీయ జెండాను కూడా రెపరెపలాడే విధంగా స్థూపం ఏర్పాటు చేశారు. ఇది సూపర్ రా నువ్వు ఆకర్షిస్తూ ఎంతోమంది విజిటర్స్ వచ్చి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. కానీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గాంధీ విగ్రహం కనీసం మెయింటెనెన్స్ లేక దుమ్ము ధూళి కొట్టుకొని ఉన్నది. పూర్తిగా రూపం కోల్పోయే విధంగా దుమ్ము పట్టడంతో విగ్రహాన్ని చూసే వారంతా విగ్రహం బాగానే ఉంది కానీ ఆయనకు సరైన గౌరవం ఇవ్వాలి. కదా కనీసం రోజుకు ఒక మున్సిపల్ వర్కర్ ని ఏర్పాటు చేస్తే మెయింటెనెన్స్ బాగుంటుందని అక్కడికి వచ్చే విజిటర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేల్కొని గాంధీ విగ్రహానికి మెయింటెనెన్స్ వ్యక్తిని ఏర్పాటు చేసి ప్రతిరోజూ శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే శాసనసభ్యులు ఆయన ఆశయం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అబాసు పాలు అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story