Bjp Mp Gvl: పడిపోయిన ర్యాంకింగ్.. అధ్వాన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్

by Disha Web Desk 16 |
Bjp Mp Gvl: పడిపోయిన ర్యాంకింగ్.. అధ్వాన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్
X

దిశ, ఉత్తరాంధ్ర: స్టార్టప్ కంపెనీల ర్యాంకింగ్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అధ్వాన్న స్థితిలో ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారం లేక ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ కంపెనీలు వెనకబడిపోయాయని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అభివృద్ధిపై పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.

'2016 సెప్టెంబర్‌లో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద ఇప్పటివరకు 86713 స్టార్టప్లకు డీపీఐఐటీ గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్టప్లు కేవలం 1341 మాత్రమే ఉన్నాయి. బీహార్, ఒడిస్సా మధ్యప్రదేశ్ తర్వాత 15వ స్థానంలో ఉంది. రాష్ట్రాల ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ 29వ స్థానంలో ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలో స్టార్టప్ల ద్వారా ప్రత్యక్షంగా 8.92 లక్షల మందికి ఉద్యోగాలు రాగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌ స్టార్టప్ రంగంలో కేవలం 12,557 మందికి ఉద్యోగాలు వచ్చాయి.' అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్లు జీవీఎల్ తెలిపారు. ఈ గణాంకాలు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్టార్టప్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed