Visakhapatnam : సీఎం జగన్ విశాఖ షిప్ట్‌పై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

by srinivas |
Visakhapatnam : సీఎం జగన్  విశాఖ షిప్ట్‌పై వైవీ సుబ్బారెడ్డి  కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రాజధాని కాబోతోందని.. సీఎం జగన్ కూడా అక్కడి నుంచే పాలించబోతున్నారని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం నిజమేని తెలుస్తోంది. విశాఖకు సీఎం జగన్ షిప్ట్ కాబోతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ఈ విషయం డైరెక్ట్ విశాఖ కార్పొరేటర్లతోనే చెప్పారు. దీంతో విశాఖకు సీఎం జగన్ వెళ్లబోతుంది ఖాయంగా కనిపిస్తోంది.

కాగా జీవీఎంసీ కార్పొరేటర్లతో వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభంకాబోతోందని చెప్పారు. వీలైతే ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో సీఎం కూడా వస్తారని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు వల్లే కాస్త ఆలస్యమైందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మరోవైపు విశాఖ రుషికొండ సమీపంలో సీఎం జగన్ క్యాంపు ఆఫీసు నిర్మాణం జరుగుతోంది. సీఎంవో ఆఫీసుతో ముఖ్యమంత్రి కూడా పక్కనే పక్కనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ రెండు నిర్మాణాలు కూడా పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు.. సీఎం షిష్ట్ అవుతున్నారని చాలా క్లియర్‌గా అర్ధమయిపోయింది.

Next Story

Most Viewed