కేజీహెచ్ న్యూక్లియర్ మెడిసిన్ వార్డులో వైద్య పరికరాలేవి?

by Disha Web Desk 16 |
కేజీహెచ్ న్యూక్లియర్ మెడిసిన్ వార్డులో వైద్య పరికరాలేవి?
X
  • పేదల ఆసుపత్రిలో అన్నీ సమస్యలే
  • -ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి

దిశ, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర పేదలకు పెద్దాసుపత్రి కేజీహెచ్ విషయంలో ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి ఆరోపించారు. కేజీహెచ్ ఆసుపత్రి వైద్యం విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రజా పోరాటాలతో ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా నిధులు విడుదల చేసినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. కేజీహెచ్‌లో క్యాన్సర్ విభాగం న్యూక్లియర్ మెడిసిన్ వార్డు ఉన్న ఒకే ఒక్క ఆసుపత్రి కాగా.. ఈ వ్యాధికి గురైన వారికి ఖర్చు లక్షల్లో అవుతుందని, కేవలం స్కానింగ్ ఇతర పరీక్షలకు 4 లక్షలు ఖర్చవుతుందని, స్కానింగ్ మెషిన్, తగిన పరికరాలు అందుబాటులో లేకపోవడం శోచనీయమన్నారు.


ఇటీవల న్యూక్లియర్ మెడిసిన్ వార్డు పరిశీలించగా ఒక వైద్యాధికారి పరిస్థితి ధీనాతిదీనమని ప్రియాంక తెలిపారు. ఆ విభాగాన్ని బతికించుకోవడానికి ఆ వైద్యధికారి పడని కష్టం లేదన్నారు. ఆ వైద్యుడికి 1.5 సంవత్సరం నుంచి వివిధ కారణాల వల్ల జీతం అందటం లేదని పేర్కొన్నారు. ఈ విభాగానికి మరో వైద్యాధికారి, స్కానింగ్ మెషిన్, వివిధ రకాల వైద్య పరికరాల కొరత ఉందన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇక్కడి అవసరాలను తెలియ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆమె పండిపడ్డారు. ఇక్కడ పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా వినతి చేసినా పట్టించుకునే వారే లేరన్నారు. సంక్షేమ పథకాల మాటేలా ఉన్నా.. ఉత్తరాంధ్ర పేదలకు అవసరాలు సమకూర్చే విధంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కేజీహెచ్ ఆసుపత్రిని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రియాంక దండి అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed