AP News:విదేశీ క్రీడలకు విశాఖలో ప్రాధాన్యం కల్పిస్తాం:ఎంపీ శ్రీభరత్

by Jakkula Mamatha |
AP News:విదేశీ క్రీడలకు విశాఖలో ప్రాధాన్యం కల్పిస్తాం:ఎంపీ శ్రీభరత్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:విదేశాల్లో ప్రాచుర్యం పొందిన పికిల్ బాల్ క్రీడను విశాఖలో ప్రారంభించడం గొప్ప ఆనందదాయకమైన విషయం అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. యండాడలో రాడిసన్ బ్లూ ఎదుట అత్తిలి స్పోర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పికిల్ బాల్ గ్రౌండ్‌ను ఆదివారం ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "యువతకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడంలో క్రీడలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. విశాఖపట్నం స్పోర్ట్స్ హబ్‌గా ఎదిగేందుకు ఇలాంటి ఆధునిక క్రీడా సదుపాయాలు చాలా అవసరం" అని అన్నారు. ఈ గ్రౌండ్ ద్వారా పికిల్ బాల్ క్రీడా సాంస్కృతిక పరిధిని విశాఖలో మరింత విస్తరింపజేయడమే కాకుండా, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే అవకాశాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. సమర్థతను పెంచడం, అవకాశాలను అందించడం ద్వారా మన యువ క్రీడాకారులు దేశం తరపున ఉన్నత స్థాయికి చేరుకోవడమే మా లక్ష్యం" అని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story