విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. ముగిసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ

by Ramesh Naini |

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. ముగిసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతులను గుర్తించిన అధికారులు, వారి భౌతికకాయాలను బంధువులకు అప్పగించారు. మృతుల్లో భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవి అప్పారావు, నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుల మృతదేహాలను ఇప్పటికే వారి స్వస్థలాలకు తరలించారు. కాగా, బీహార్‌కు చెందిన మరో కార్మికుడు గోల్డ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంకా చేరుకోకపోవడంతో, వారి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. వారు రాగానే ఆ మృతదేహాన్ని కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇద్దరి పరిస్థితి విషమం!

సోమవారం స్టీల్‌ ప్లాంట్‌లో మెటల్ లిక్విడ్ లాడిల్ పేలి, ఉక్కు ద్రవం మీద పడిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story