100 శాతం పరిహారం ఇవ్వాల్సిందే.. విశాఖ బోట్ల నష్టంపై టీడీపీ రియాక్షన్

by Disha Web Desk 16 |
100 శాతం పరిహారం ఇవ్వాల్సిందే.. విశాఖ బోట్ల నష్టంపై టీడీపీ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 39 బోట్లు కాలిపోయిన విషయం తెలిసిందే. అయితే బాధితులకు 80 శాతం పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే 100 శాతం పరిహారం చెల్లించాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారుకు పూర్తిగా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ హార్బర్ వద్ద అగ్నిప్రమాద ఘటనను ఆయన పరిశీలించారు.


ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం సాయం ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు. 39 బోట్లు దగ్ధం కావడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. ఉన్న హార్బర్లకే రక్షణ లేదని, కొత్తవి కట్టిస్తామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాధితులకు అందాల్సిన పరిహారం వెంటనే ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయ పోరాటం చేస్తామని బాధితులకు కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed