Visakha: ఐస్‌పై నిలబడి టీడీపీ వినూత్న నిరసన

by Disha Web Desk 16 |
Visakha: ఐస్‌పై నిలబడి టీడీపీ వినూత్న నిరసన
X

దిశ, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టిడిపి శ్రేణుడు వినూత్న నిరసన చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా టిడిపి నేత చిక్కాల విజయ్ బాబు 43వ వార్డ్ అధ్యక్షుడు జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు బొడ్డేటి మోహన్ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో ఐస్ గడ్డలపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబు విడుదల కావాలని, ఆయన క్షేమంగా ఉండాలని నినాదాలు చేశారు. బాబుతో తాను కరపత్రాలు ఇంటింటికి పంచారు.

Next Story

Most Viewed