ధర్మ రక్షణతోనే ప్రపంచ శాంతి సాధ్యం: ఆర్‌ఎస్‌ఎస్

by Disha Web Desk 16 |
ధర్మ రక్షణతోనే ప్రపంచ శాంతి సాధ్యం: ఆర్‌ఎస్‌ఎస్
X

దిశ, ఉత్తరాంధ్ర: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశాఖ మహానగర్ ఆధ్వర్యంలో మహా నగర్ సాంఘిక్ కార్యక్రమం ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్‌లో జరిగింది. ఇందులో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పలు రకాల విన్యాసాలు ప్రదర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కమిటీ సభ్యుడు భాగయ్య మాట్లాడుతూ సంత్ రవి దాస్ జయంతి రోజున సాంఘీక్ జరగడం ఆనందకరమన్నారు. హిందూ ధర్మమే ప్రజలను కాపాడుతోందని ఆయన తెలిపారు. ప్రజా జీవనంలో నియమాలు జీవన విధానం కావాలని పేర్కొన్నారు. దేశం, జాతి, సమాజం, సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ధర్మ రక్షణ వల్లనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందన్నారు. మనది వసుదైక కుటుంబమని, ఇతర ప్రాణుల పట్ల ప్రేమ, కరుణ ఉండాలని సూచించారు. ఇప్పుడు మనుషుల్లో ద్వేషం, అసూయ, అహంకారం పెరుతున్నాయన్నారు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతి కరుణ, ధర్మం ఉండాలని, హిందూత్వంతోనే సాధ్యమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శక్తి కేంద్రాలు, చైతన్య కేంద్రాలు కావాలని పేర్కొన్నారు. స్వయం సేవకులు ఎన్నో ఉద్యమాలులో పాల్గొన్నారని గుర్తు చేశారు. విద్యా సంస్థలలో మానవత్వం, ధైర్యం, విచక్షణ నేర్పాలని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కమిటీ సభ్యుడు భాగయ్య తెలిపారు.


Next Story

Most Viewed