- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన శాశ్వత, ఒప్పంద (కాంట్రాక్ట్) ఉద్యోగుల కుటుంబాలకు ఒకే తరహా సాయాన్ని మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. వారి పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు స్టీల్‌ప్లాంట్‌లోనే క్వార్టర్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
టీమ్-11 కెప్టెన్ పరామర్శించడానికి వచ్చారా?
కార్మికుల ఆకాంక్షల మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడి, దానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పెద్ద సంఖ్యలో కొత్త కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ‘స్టీల్‌ప్లాంట్‌లో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే టీమ్-11 కెప్టెన్ పరామర్శించడానికి వచ్చారా?’ అంటూ ప్రశ్నించారు. కొందరు కార్మిక సంఘాల నేతలు కావాలనే ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.






