పెళ్లి కూతురు కేసులో కొత్త ట్విస్ట్.. ఆమె శరీరంలో అవెందుకు ఉన్నాయ్..?

by Dishafeatures2 |
పెళ్లి కూతురు కేసులో కొత్త ట్విస్ట్.. ఆమె శరీరంలో అవెందుకు ఉన్నాయ్..?
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ మధురవాడలో నవ వధువు ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. పెళ్లి కూతురు మృతదేహాన్ని పరీక్షించిన డాక్టర్లు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మృతురాలు సృజనది ఆత్మహత్య, హత్య అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సృజన శరీరంలో విష పదార్థం గుర్తించినట్లు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. డాక్టర్లు రిపోర్ట్‌ను పీఎం పాలెం సీఐ మీడియాకు తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటే ఆమె శరీరంలో విష పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లికి ముందే సృజన అసలెందుకు ఆత్మహత్యకు పాల్పడింది? అసలు ఇది ఆత్మహత్యా, హత్యా? ఇదే విధంగా మరెన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ చెక్ చెప్తుందని అధికారులు అంటున్నారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు నిజాలు ఏమని వెలువడుతాయా అని పీఎం పాలెం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Next Story

Most Viewed