వైసీపీలో మార్పులు, చేర్పులపై మంత్రి అమర్‌నాథ్ సీరియస్ కామెంట్స్

by Disha Web Desk 16 |
వైసీపీలో మార్పులు, చేర్పులపై మంత్రి అమర్‌నాథ్ సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్థానచలనం కలిగిస్తున్నారు. మరికొంతమందికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వడంలేదు. దీంతో కొందరిలో అసంతృప్తి తీవ్రంగా ఉంది. పక్క నియోజకవర్గాలకు వెళ్లేందుకు ససేమీరా అంటున్నారు. ఓడిపోతామోనన్న భయం మరికొందరిలో నెలకొంది. దీంతో పార్టీ వీడేందుకు కొందరు సన్నద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో మార్పులు, చేర్పులపై మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సీఎం జగన్ మార్పులు, చేర్పులు చేస్తున్నారని తెలిపారు. అలాంటి నిర్ణయాన్ని పార్టీలో ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మార్పులను వ్యతిరేకించేవాళ్ల బయటకు వెళ్లడమే మంచిదన్నారు. ఎంత మంది వెళ్లినా పార్టీ మాత్రం మాత్రం ఎలాంటి ఢోకా లేదన్నారు. తనను పోటీ నుంచి తప్పుకోమన్నా సంతోషంగా పోతానని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ జెండాను మాత్రం వదలనన్నారు. మళ్లీ వైసీపీని గెలిపించాలని ప్రజల్లోకి వెళ్తానని మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed