'జయహో బీసీ' మహాసభను విజయవంతం చేయండి

by Disha Web Desk 16 |
జయహో బీసీ మహాసభను విజయవంతం చేయండి
X

- ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

దిశ, ఉత్తరాంధ్ర: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో డిసెంబర్ 7న జరిగే 'జయహో బీసీ' మహాసభకు ఎస్.కోట నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవుల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి వార్డు స్థాయి బీసీ నాయకులంతా తరలివెళ్లి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొత్తవలస మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తితో వెనుకబడిన వర్గాల అభున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించారని గుర్తుచేశారు. బీసీలంటే ఓటు బ్యాంకులా కాకుండా వైసీపీకి, ప్రభుత్వానికి వెన్నుముకగా ముఖ్యమంత్రి జగన్ భావించి చట్ట సభల్లో అత్యధికంగా అవకాశం కల్పించారని తెలిపారు. వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులను ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బీసీల్లోని అన్ని వర్గాల వారికి మూడున్నరేళ్ళగా తమ ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, అదేవిధంగా సుమారు రూ.50 వేల కోట్లు బీసీల్లోని అన్ని వర్గాల వారి సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు. 53 బీసీ కులాల కార్పొరేషన్ల ద్వారా బీసీ కులాలకు న్యాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, సర్పంచ్ లు మచ్చ ఎర్రయ్య రామస్వామి, విరోతి కొండలరావు, చింతల పైడినాయుడు, గేదెల మూర్తి, కృష్ణ, ఏమ్పీటీసి వెలగాల వెంకటరమణ, మండల పార్టీ అద్యక్షుడు ఒబ్బిన నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు మేలాస్త్రీ అప్పారావు, పల్లా.భీష్మ, పి.ఎస్.ఎన్.పాత్రుడు, లెంక రామన్నపాత్రుడు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story