బంగారం చోరీ కేసులో సినీ నటి అరెస్ట్

by Disha Web Desk 18 |
బంగారం చోరీ కేసులో సినీ నటి అరెస్ట్
X

దిశ, ప్రతినిధి: ఈ రోజు విశాఖ జిల్లాలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరుగుతున్న దొంగతనాలు చాలా వరకు పరిచయం ఉన్న వారే చేస్తున్నారు అనడానికి నిదర్శనమే ఆదివారం జరిగిన చోరీ. కేజీ బంగారం చోరీ చేసిన కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు చేపట్టగా గత కొంత కాలంగా సౌమ్య శెట్టి ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుందాని తెలిసింది. పరిచయాన్ని అవకాశంగా తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి పక్కా ప్లాన్ తో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ సహా పలు మూవీల్లో సౌమ్య శెట్టి నటించింది.


Next Story

Most Viewed