BRS: ఫస్ట్ లిస్ట్‌లో పేరు.. కార్యకర్తల భేటీలో కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

by srinivas |
BRS: ఫస్ట్ లిస్ట్‌లో పేరు.. కార్యకర్తల భేటీలో కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ అధిష్టానం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరికి సీటు ఇచ్చినట్లు ఆ పార్టీ లిస్టు విడుదల చేసింది. దీంతో వచ్చే ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కసరత్తు పెంచారు. కార్యకర్తలను కలిసి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ పట్టణంలో కార్యకర్తలతో ఈ రోజు భేటీ నిర్వహించారు. ఎన్నికలకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తాను తప్పు చేయనని.. నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు. కడియం శ్రీహరి వస్తే అవినీతి పరులకు భయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వస్తున్నానంటే గోకేవారు, గీకేవారు పారిపోవాల్సిందేనని చెప్పారు. అలాగే భూ కబ్జాదారులు సైతం వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశ్వీర్వదించాలని కోరారు. అలా చేస్తే స్టేషన్ ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీ చేసి అభివృద్ధి చేస్తానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed