బీజేపీ ప్రజా పోరు రథం ప్రారంభం..

by Disha Web Desk 18 |
బీజేపీ ప్రజా పోరు రథం ప్రారంభం..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పార్లమెంట్ జిల్లా ఎస్.కోట నియోజకవర్గం లో వారాది చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పోరు యాత్ర రథాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శృంగవరపు కోట నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరంగం దినేష్, జిల్లా నాయకులు వసంత వర్మ, నియోజకవర్గ కన్వీనర్ ఎలమంచిలి ప్రసాద్, కో కన్వీనర్ చొక్కాకుల అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు చొక్కాకుల జగదీశ్వరి, మునగపాక త్రినాధ రావు, గోకడ మహేష్, గోవింద్, గణేష్ మొదలగు వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవీంద్ర మేడపాటి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గ రథాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో వాడవాడకు వెళ్లి భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించి రానున్న ఎన్నికల్లో పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పని చేయడం జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులతోనే జరుగుతున్నాయని కేంద్రం నిధులు ఇస్తూ అభివృద్ధి చేస్తున్నప్పుడు వేరే ఏ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు.


Next Story

Most Viewed