మీలోమీకే క్లారిటీ లేదు.. మీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు.. కొడాలినాని

by Disha Web Desk 3 |
మీలోమీకే క్లారిటీ లేదు.. మీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు.. కొడాలినాని
X

దిశ, డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసేందుకు పొత్తు కుదుర్చుకున్న విషయం అందరికి సుపరిచితమే. అయితే పార్టీ పొత్తు కుదిరినంత సులువుగా సీట్ల కేటాయింపు విషయంలో పొత్తు కుదరడం లేదు. జనసేన పార్టీతో చర్చించకుండా చంద్రబాబు అరకు, మండపేట సీట్లను ప్రకటించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తీరుపై అసహనానికి గురైన పవన్ కళ్యాణ్ కూడా రాజోలు, రాజానగరం సీట్లను అధికారికంగా ప్రకటించారు. టీడీపీ, జనసేన మధ్య చోటు చేసుకున్న అరమరికలు వైసీపీ నేతలకు అవకాశంగా మారాయి. దీనితో కొడాలి నాని X వేదికగా "పొత్తు చిత్తు" అనే టైటిల్ తో వీడియో అని అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో జనసేన కార్యకర్త, టీడీపీ కార్యకర్త , అలానే ఓ సాధారణ వ్యక్తి ఉన్నారు.

ఆ వ్యక్తితో టీడీపీ కార్యకర్త ఈ సారి ఇక్కడ మా పార్టీ వాడు నిలబడుతున్నారు, నీ ఓటు అతనికే వెయ్యాలి అని అడుగుతారు. అది విన్న జనసేన కార్యకర్త ఏంటి సైకిల్ కి వేసేది ఈ సారి మా పార్టీ వాడు నిలబడుతున్నారు అని నీ ఓటు గాజు గ్లాస్ కె వెయ్యాలి అంటారు. అప్పుడు టీడీపీ కార్యకర్త పొత్తు పెట్టుకున్నాం కదా అని మీరు అడిగినన్ని సీట్లు ఇవ్వడం కుదరదు అంటారు. అందుకు జనసేన కార్యకర్త మా పార్టీ లేకపోతే మీకు అసలు పొత్తే లేదంటారు.

అందుకు టీడీపీ కార్యకర్త కోపంగా ఇక్కడ మీ పార్టీ వాడు నిలబడితే మేము ఓటు వెయ్యం అంటారు, అందుకు సమాధానంగా జనసేన కార్యకర్త రాష్ట్రంలో మీ పార్టీ వాడు ఎక్కడ నిలబడిన మేము అసలు ఓటు వెయ్యం రా అంటారు. ఆ మాటకు ఆగ్రహానికి లోనైన టీడీపీ కార్యకర్త గ్లాస్ ను తోసేస్తాడు. అందుకు ప్రతిస్పందనగా జనసేన కార్యకర్త సైకిల్ ను కాలితో తన్ని కింద పడేస్తారు.

అప్పటివరకు అక్కడ జరుగుతున్న సంభాషనంతా చూస్తున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి ఆపండ్రా మీ గొడవ.. ఒకడు పాతికేళ్ల భాష్యత్తు అంటాడు.. ఇంకొకడు బాబు షూరిటీ అంటాడు.. అసలు మీలోనే మీకు క్లారిటీ లేదు, మీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు. మీరు మమ్మల్ని ఉద్ధరిస్తారు అని వ్యంగ్యంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు.మీలో మీకే స్పష్టత లేదు.. ప్రజలకి ఏం మంచి చేస్తారు అనే లైన్స్ పడి వీడియో ఎండ్ అయిపోతుంది.

కాగా ఈ వీడియో ని అప్లోడ్ చేసిన కొన్నిగంటల్లోనే వైరల్ గా మారింది. ఏదేమైనా జనసేన, టీడీపీ మధ్య వచ్చిన మనస్పర్థలు వైసీపీ నేతలు మాట్లాడేందుకు అవకాశాన్ని ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed