ప్రమాదకరంగా ప్రధాన రహదారులు.. వాహనాలు రాకపోకలు బంద్

by Jakkula Mamatha |
ప్రమాదకరంగా ప్రధాన రహదారులు.. వాహనాలు రాకపోకలు బంద్
X

దిశ,మంత్రాలయం రూరల్/కోసిగి:ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ అధికారులు మారిన భద్ర బొమ్మలాపురం గ్రామం నుండి తుమ్మిగనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు పరిస్థితి మాత్రం ఇంతే. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో సాతానూరు గ్రామం పక్కన తుంగభద్ర రైల్వే స్టేషన్, మంత్రాలయం, రాయచూరుకు వెళ్లే ప్రయాణికులకు రోడ్డు ఇబ్బందికరంగా మారింది. గత రెండు రోజుల నుంచి రైతులు ఉల్లి తదితర లారీ లోడులను తరలించడం ద్వారా ప్రధాన రోడ్డు పూర్తిగా గుంతలుగా మారిపోయింది.

ఆదివారం రెండు గంటల సమయంలో ఒక ట్రాక్టర్ బండలను తరలించే సమయంలో గుంతలు పడ్డ రోడ్డులో ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. జేసీబీ ద్వారా ట్రాక్టర్‌ను బయటికి లాగేశారు. ఇక అక్కడ ద్విచక్ర వాహనాలు పోవడానికి ఇబ్బందికరంగా మారడంతో నాలుగు చక్రాల వాహనాలు తుంగభద్రకి వెళ్లాలంటే కోసిగికి వెళ్లి జంపాపురం, ఐరనగల్లు మీదుగా తుంగభద్ర కు వెళ్తున్నారు. ఈ ప్రధాన రోడ్డును ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు మారిన రోడ్డు రాకపోకలు బంద్ కలగడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపైనా అధికారులు ఈ ప్రధాన రోడ్డు పై దృష్టి పెట్టాలని ప్రయాణికులు అధికారులను కోరారు.

Advertisement

Next Story