రాష్ట్రంలో మోగిన సమ్మె సైరన్

by Web Desk |
రాష్ట్రంలో మోగిన సమ్మె సైరన్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగింది. అనుకున్నట్లుగానే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో రాష్ట్ర జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కు పీఆర్సీ సమితి స్టీరింగ్ కమిటీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో పాటు 50కు పైగా ఇతర డిమాండ్లతో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు దిగుతున్నారు. ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు.

జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కు నోటీసులు ఇచ్చిన వారిలో బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు. పీఆర్సీ విషయంలో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేశారని సమ్మె నోటీసులో ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Next Story