ఏపీ అప్పులపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Defence Minister Rajnath Singh
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అప్పులపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 13.50 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆయన తెలిపారు. లెక్కకు మించి అప్పులు చేసినట్లు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ. 2 లక్షల రుణభారం మోపారని మండిపడ్డారు. ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పర్యటించిన ఆయన ప్రభుత్వానికి కేంద్రం సహకరించినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టలేకపోయిందన్నారు. విశాఖను డ్రగ్స్‌కు కేంద్రంగా చేశారని ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌తో పాటు మైనింగ్, ల్యాండ్ మాఫియాలు రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు. వైపీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి కూరుకుపోయిందని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. ఎన్టీయే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు. 2029 ఎన్నికలకు పూర్తి స్థాయిలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని రాజ్ నాథ సింగ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed