విశాఖ మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ కార్లు

by Disha Web |
విశాఖ మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ కార్లు
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ మార్కెట్ లోకి ఒకేసారి రెండు కొత్త హ్యుందాయ్ కార్లు వచ్చేసాయి. జయలక్ష్మి ఆటో మోటివిస్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన లక్ష్మీ హోండాయి షోరూం లో ఈ రెండు సరికొత్త మోడల్ కార్లను ప్రభుత్వ సలహాదారు గాది శ్రీధర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ది న్యూ హ్యుందాయ్ ఆరా తో పాటు ది న్యూ హ్యుందాయ్గ్రాండ్ 10 నియోస్.. ఈ రెండు కొత్త మోడల్ కార్లు కొత్త తరానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. హ్యుందాయ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ రెండు కొత్త మోడల్ కార్లు అన్ని వర్గాల వారు మెచ్చుకునే విధంగా తీర్చిదిద్దారన్నారు. ఈ కార్లకు ఉత్తమమైన సెగ్మెంట్ ఫీచర్లు ఉండడంతో కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.


లక్ష్మీ హోండా సీఈవో డాక్టర్ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కస్టమర్ తో పాటు డ్రైవింగ్ చేసేవారి అనుభవాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు మించి బహుళ ఉత్తమ ఇన్ క్లాస్ ఫీచర్లు ఈ కార్లలో పొందుపరచామని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ కార్ల నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని చెప్పారు. హ్యుందాయ్ అందిస్తున్న ఈ రెండు మోడళ్లలో మొదటది రూ. 6,29, 600 లు కాగా, రెండోది రూ.5,68,500ల అందుబాటులో ఉండే ధరను నిర్ణయించినట్టు తెలిపారు. పై ధరలు మొదట కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యుందాయ్ కార్లు వినియోగదారులు, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కిషోర్ కుమార్, లక్ష్మీ హోండా సిబ్బంది పాల్గొన్నారు.


Next Story