- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుళాయి వివాదం.. కత్తులతో దాడి చేసుకున్న రెండు వర్గాలు

దిశ,వెబ్‌డెస్క్: నెల్లురూ జిల్లాలో రెండు వర్గాల మధ్య గొడవ(fight)లు జరగడం కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. కుళాయి(faucet) వద్ద జరిగిన వివాదం రెండు వర్గాల గొడవ గా మారిపోయింది. నెల్లూరు జిల్లా(Nellore District) మనుబోలు మండలం (Manubolu Mandal) బద్దెవోలులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే నీటిని పట్టుకునే క్రమంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. నీళ్లు పట్టుకునే క్రమంలో గొడవ రాజుకోవడంతో జనాలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వెంటనే గాయపడిన వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి (Gudur Area Hospital) తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.