- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గత ఐదేళ్లలో గోవుల గడ్డిని కూడా తినేశారు’.. టీటీడీ ఛైర్మన్ షాకింగ్ కామెంట్స్
టీటీడీ ఎస్వీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయని ఇటీవల వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ ఎస్వీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయని ఇటీవల వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ తరుణంలో భూమన పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే టీటీడీ చైర్మన్, పలువురు అధికారులు ఇవాళ(శనివారం) తిరుపతిలోని టీటీడీ గో సంరక్షణ శాలను పరిశీలించారు. గోరక్షక దళ్ వ్యవస్థాపకులు టీటీడీ గోసంరక్షక మాజీ సభ్యుడు కోటి శ్రీధర్, గోరక్షక దళ్ తెలంగాణ అధ్యక్షుడు కాలు సింగ్ టీటీడీ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. ఈ క్రమంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని విమర్శలు గుప్పించారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీ ఇన్నీ కావని బీఆర్ నాయుడు ఆరోపణలు చేశారు.






