సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఛైర్మన్.. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

by Naga Rani Yarlagadda |

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (CM Chandrababu Naidu) టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈఓ క్యాంపు కార్యాలయంలో కలిశారు.

సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఛైర్మన్.. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (CM Chandrababu Naidu) టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈఓ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి స్వామివారి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ (TTD) వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి తిరుమలలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు (Tirumala Brahmotsavam 2025) ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీఎంకు ఆహ్వాన పత్రం అందజేశారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో చేస్తోన్న ఏర్పాట్ల గురించి సీఎం చంద్రబాబు.. బీఆర్ నాయుడిని అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు.

Next Story