చింతలపూడి టీడీపీలో అలజడి

by Disha Web Desk 10 |
చింతలపూడి టీడీపీలో అలజడి
X

దిశ, ఏలూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో చింతలపూడి ఒకటి. ఈ నియోజకవర్గంలో సైకిల్ పార్టీని నడిపించే ప్రధాన నాయకుడు లేకపోవడంతో ఆ స్థానం కోసం ఆశావాహులు సంఖ్య పెరగటమే కాకుండా గ్రూప్ లు కూడా ఎక్కువవుతున్నాయి. టికెట్ తమదంటే తమదంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ అధినేతతో కలిసి సెల్ఫీలు దిగి మరీ టికెట్ ఖయమైపోయిందని కొందరు నేతలు ప్రచారం ప్రారంభించారట. ఓ నాయకుడైతే ఏకంగా అభిమానులతో ఇన్చార్జి స్థానం తనదేనని ప్రచారం చేపించేస్తున్నారట. దీని కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని లీక్స్ ఇవ్వడంతో మిగిలిన వారికి ముచ్చెమటలు పడుతున్నాయట. టీడీపీకి ఇన్చార్జిపై స్పష్టత రాకపోవడంతో తమ్ముళ్లు కూడా డైలమాలో పడినట్లు తెలుస్తోంది.

ముహూర్తం లేట్ అయితే సైకిల్ కి షాకేనా

ఎన్నికల సమీపిస్తున్న వేళ చింతలపూడి అసెంబ్లీకి టీడీపీ ఇన్చార్జి ముహూర్తం ఖరారు కాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో ఉన్నారు. మరో వైపు నియోజవర్గ టీడీపీలో నిన్న మొన్నటి వరకు రెండు, మూడుగా ఉన్న గ్రూపులు క్రమేణా పెరిగిపోతున్నాయి. మరో వైపు అధికార పార్టీ ముందడుగు వేస్తూ తమ పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. గెలుపు దిశగా టిడిపి ప్రయత్నాలు సాగించాలంటే పార్టీ అధ్యక్ష పదవి కేటాయింపు అవసరమని సీనియర్లు బాహాటంగా అంటున్నారు. లేదంటే గ్రూపుల కారణంగా పార్టీకి ఇబ్బందులు తప్పవహని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పదవి ముహూర్తం ఖరారు లేట్ అయితే ప్రజల్లో అవగాహన లోపం తో పాటు పార్టీకి భారీ షాకే తగులుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

రోషన్ కుమార్ కే ఖాయమా ?

నియోజవర్గంలో టిడిపి తరఫున అసెంబ్లీ స్థానం ఆశిస్తున్న వారిలో సొంఘా రోషన్ కుమార్ ఒకరు. ఈయన మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ తరఫున జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందుతున్నారు. ఇప్పటి వరకు చింతలపూడి నియోజకవర్గం నుంచి రెండుసార్లుగా టికెట్ కోసం ఆశపడి భంగపడ్డారు. ఈసారి టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ కార్యకర్త నుంచి సీనియర్ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. చింతలపూడి నియోజకవర్గ స్థానం దాదాపు ఆయనకే ఖరారు అయినట్లు చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో సైలెంట్ గా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ, అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకాబోతున్నారని సీనియర్లు సైతం అంటున్నారు. అయితే టీడీపీ అధినేత మనసులో చింతలపూడి నియోజకవర్గంపై ఏముందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి : Ap News: ట్రాన్స్‌జెండర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్

Next Story

Most Viewed