పుట్టపర్తిలో కుండపోత వర్షం..రోడ్లపై పొంగి ప్రవహించిన వరద నీరు

by Jakkula Mamatha |
పుట్టపర్తిలో కుండపోత వర్షం..రోడ్లపై పొంగి ప్రవహించిన వరద నీరు
X

దిశ ప్రతినిధి,పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. దంచికొట్టిన వర్షానికి పట్టణం తడిసి ముద్దైంది. రోడ్లపై మోకాళ్ళ లోతు నీరు ప్రవహించడంతో వాహనదారులు,స్థానికులు అవస్థలు పడుతున్నారు. సత్యమ్మ ఆలయం చుట్టూ భారీగా వరద నీరు చేరడంతో అటువైపు రాకపోకలు సాగించేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజులుగా ఎండలు పెరిగిపోవడంతో అల్లాడిపోయిన జనానికి భారీ వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో లోతట్టు ప్రాంతాల్లోని సాయినగర్ కాలనికి చెందిన జనం వరద నీరు ఎక్కడ ముంచెత్తుతుందోనని భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.Next Story

Most Viewed