తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆరోజు ఆలయం మూసివేత

by Disha Web Desk 21 |
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆరోజు ఆలయం మూసివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ నెల 28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 29న పాక్షిక చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో 28న సాయంత్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇకపోతే 29న తెల్లవారుజామున 1.05 గంటలకు గ్రహణం మొదలై 2.22 గంటల వరకు కొనసాగుతుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో దాదాపు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది.పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. 29న తెల్లవారుజామున 3.15 గంటలకు ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీడీపీ వెల్లడించింది. ఈ విషయాన్ని భక్తులు గ్రహించాలని విజ్ఞప్తి చేసింది. పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో అక్టోబర్ 28న సహస్రదీపాలంకరణ సేవ, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్న సంగతి తెలిసిందే.

శ్రీశైలం ఆలయం మూసివేత

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయం సైతం మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు. ఈనెల 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 28న సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తున్నట్లు తెలిపింది. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. 29న ఉదయం 7 గంటల తర్వాత శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.

ద్వారకా తిరుమల ఆలయం సైతం

పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఈనెల 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ఈవో వేండ్ర త్రినాథరావు వెల్లడించారు. మరుసటి రోజు 29న తెల్లవారుజామున 4 గంటలకు యథావిధిగా ఆలయ ద్వారాలను తెరచి సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలను అర్చకులు జరుపుతారని వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గ్రహించాలని ఈవో వేండ్ర త్రినాథరావు సూచించారు.



Next Story

Most Viewed