చంద్రబాబుతో ములాఖత్‌కు ఈసారి ఆ ముగ్గురికి అవకాశం!

by Disha Web Desk 2 |
చంద్రబాబుతో ములాఖత్‌కు ఈసారి ఆ ముగ్గురికి అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబులో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. దీనికి ఇప్పటికే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి, పార్టీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు కలవనున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ములాఖత్ అవుతారని వార్తలు వినిపించగా.. కలవాలని ఉన్నా.. కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ వల్ల కాలేకపోతున్నానని రజినీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణలు ములాఖత్ అయ్యారు.

Read More : Jr NTR కంటే బ్రాహ్మణికే పాపులారిటీ ఎక్కువ.. ఆర్జీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్

Next Story

Most Viewed