Breaking: ఏపీలో టీచర్ల బదిలీల విధివిధానాలు ఇవే..

by srinivas |
Breaking: ఏపీలో టీచర్ల బదిలీల విధివిధానాలు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టీచర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన విధివిధానాలను సైతం జారీ చేసింది. 8 ఏళ్లు ఒకే చోట పని చేసిన టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేసింది. ఐదేళ్ల ఒకేచోట చేసిన హెడ్మాస్టర్ల బదిలీని కూడా తప్పనిసరి చేసింది. కొత్త జిల్లాలు యూనిట్‌గా తీసుకుని టీచర్లను బదిలీలు చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఖాళీ అవుతున్న పోస్టులతో కలిపి ప్రభుత్వం నోటిఫై చేసింది.

కాగా టీచర్ల బదిలీలకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు బదిలీలపై ఎప్పటి నుంచో ఉన్న నిషేధాన్ని కూడా సడలించింది. టీచర్ల అభ్యర్థన , పాలనాపరమైన కారణాలతో బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న వాళ్లందరూ బదిలీ అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల ఉద్యోగులను ఈ బదిలీల నుంచి మినహాంపు ఇచ్చింది.

Also Read..

గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. మే 24న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు

Advertisement

Next Story