అవినీతిపై రంగంలోకి దిగిన మంత్రి నాదెండ్ల.. వెంటనే ప్రక్షాళన షురూ

by Mahesh |
అవినీతిపై రంగంలోకి దిగిన మంత్రి నాదెండ్ల.. వెంటనే ప్రక్షాళన షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ యాక్షన్ లోకి దిగారు. గీత ప్రభుత్వ హయంలో పౌరసరఫరాల శాఖలో భారీగా అవినీతి జరిగిందని. వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం అనేక స్కాంలు చేశారన్నారు. దీనిపై వివరాలను సేకరించి అవకతవకలపై విచారణ జరిపిస్తామని.. సదరు అధికారులు వారంలో అన్ని నివేదికలు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహార్ అధికారులకు దిశ నిర్దేశం చేశారు.Next Story

Most Viewed