Breaking News: బీజేపీలో జనసేన విలీనం.. కేంద్రమంత్రిగా పవన్ కల్యాణ్..!

by srinivas |
Breaking News: బీజేపీలో జనసేన విలీనం.. కేంద్రమంత్రిగా పవన్ కల్యాణ్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ, జనసేన , టీడీపీ కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది. అయితే బీజేపీ, టీడీపీ పొత్తు కుదర్చడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర వహించారు. కానీ ఈ పొత్తు వెనుక భారీ వ్యూహం ఉన్నట్టుగా అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుస్తే.. పవన్ కల్యాణ్‌ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్‌ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అగ్ర నేతలు సూచించినట్లుగా సమచారం. ఈ ఆదేశాలతోనే పవన్ కల్యాణ్ కాకినాడ లేదా అనకాపల్లి నుంచి ఏదో ఒక చోట ఎంపీ బరిలో ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ఇప్పటికే సర్వే ద్వారా ధీమాగా ఉన్న ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్ ఎంపీగా గెలిస్తే ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల తర్వాత బీజేపీలో జనసేనను విలీనం చేసి పూర్తి స్థాయి ఏపీ బాధ్యతలు పవన్ కల్యాణ్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఏ విధంగానైతే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించారో.. అదే వ్యూహాన్ని ఏపీలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారు చేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల తర్వాత ఇదే నిజమవుతుందో.. మరోలా పరిస్థితులు ఉంటాయో చూడాలంటే మరికొన్ని ఆగాల్సిందే.



Next Story

Most Viewed