ముఖ్యమంత్రి పర్యటనపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ

by Disha Web Desk 10 |
ముఖ్యమంత్రి పర్యటనపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. విశాఖలోని జీ-20 సదస్సు ముగింపు అనంతరం తాడేపల్లి నివాసం చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. అయితే ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈనెల 17న ఢిల్లీలో సీఎం జగన్ పర్యటించారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే రెండు వారాల వ్యవధిలోనే మరోసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సాయంత్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సైతం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం, జీ-20 సదస్సు ముగింపు తర్వాత హుటాహుటిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటించడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ జరుగుతుండటం, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీబీఐ విచారణాధికారిని మార్చాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. అదే తరుణంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర జలశక్తి శాఖ చేస్తున్న ప్రకటనలపైనా కేంద్రంతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed