ఆ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీకీ అనుగుణంగానే వేతనాలు

by Disha Web Desk 21 |
ఆ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీకీ అనుగుణంగానే వేతనాలు
X

దిశ, ఏపీ బ్యూరో : ఆర్టీసీ ఉద్యోగులకు పెంచిన పీఆర్‌సీకి అనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదోన్నతులు పొందిన 2వేల మంది ఉద్యోగులకు అక్టోబర్‌లో పాత వేతనాలే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. పదోన్నతుల ఆమోదం అనంతరమే ఉద్యోగులకు పెంచిన వేతనాలు చెల్లించనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సు భవన్‌లో గురువారం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దసరాకు సంబంధించి ప్రయాణికులకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. దసరా నాటికి 'స్టార్‌ లైనర్‌' పేరిట నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమలరావు వెల్లడించారు. మొత్తంగా 62 స్టార్ లైనర్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సరికొత్త విధానంలో ప్రయోగాత్మకంగా ఈసారి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. మంచి ఫలితాలు వస్తే ఇదే విధానాన్ని కొనసాగిస్తామని, లేదంటే పాత పద్ధతి అమలుపై ఆలోచిస్తామన్నారు.


Next Story

Most Viewed