‘ఆడుదాం.. ఆంధ్ర’లో అవినీతి.. స్పెషల్ టీమ్‌తో ఎంక్వైరీ

by srinivas |
‘ఆడుదాం.. ఆంధ్ర’లో అవినీతి.. స్పెషల్ టీమ్‌తో ఎంక్వైరీ
X

దిశ, వెబ్ డెస్క్: ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భారీగా అవినితి జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా అవినీతిని వెలికితీసేందుకు రెడీ అయింది. ప్రత్యేక కమిటీతో విచారణ చేయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి రామ్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ‘ఆడుదాం.. ఆంధ్ర’ కార్యక్రమంతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన తెలిపారు. దాదాపు రూ. 130 కోట్ల మేర స్కాం జరిగినట్లు చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం పేరుతో క్రీడాకారుల కడుపు కొట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రచారం కోసం ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేడియాలను ఆధునీకరిస్తామన్నారు. క్రీడాకారులకు మంచి శిక్షణ ఇస్తామని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు.Next Story

Most Viewed