వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. వాటిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-02 10:33:56.0  )
వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. వాటిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తాజాగా వాలంటీర్లకు(volunteers) షాకిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్ల పై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల(volunteers)కు ఉచితంగా న్యూస్‌పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించి.. దానికి ప్రభుత్వం అదనంగా రూ.200 అలవెన్సు ఇచ్చేది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును(allowances) ఎన్డీయే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అలవెన్సుల పేరుతో ఆర్థిక దుర్వినియోగం(Financial abuse) జరుగుతోందన్నారు. అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు అందించే అదనపు అలవెన్సులు(allowances) ఆపేయాలని ప్రతిపాదనలను ఆమోదించింది. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed