- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా.. ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం
దిశ, అమలాపురం:అమలాపురం పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కల్వకొలను తాతాజీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అంబేద్కర్ కోనసీమ జిల్లా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డికి పంపారు. ఇప్పటికే ఆయన జనసేన లో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగా నల్లా శ్రీధర్ నిర్వహించిన రధ యాత్రలో ఆయన పాల్గొన్నారు.
స్వయంగా మంత్రి నాదేండ్ల తాతాజీ ఇంటికి వెళ్లి జనసేనలో చేరాలని కోరినప్పటికి ఆయన తాను ముద్రగడ వెంటే అని చెప్పి తిరస్కరించారు. అయితే ముద్రగడ వైసీపీలో చేరినప్పటికి తాతాజీ మౌనంగా ఉండి పోయారు. బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఇప్పటికే జనసేన నాయకులు లింగోలు పండు, ఏడిద శ్రీనులు అధిష్టానం వద్ద లైన్ క్లియర్ చేయడంతో జనసేన పార్టీలోకి చేరడం లాంఛనమే అని పలువురు చర్చించుకుంటున్నారు.