- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మరోసారి విచారణకు హాజరైన మాజీ మంత్రి.. దర్యాప్తునకు సహకరించలేదన్న పోలీసులు
దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హాయంలో చంద్రబాబు ఇంటి పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే రెండు సార్లు విచారణకు హాజరైన జోగి రమేష్‌కు మరోసారి విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇంటి పై దాడి కేసు సంబంధించి మంగళగిరి పోలీసు స్టేషన్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ముగిసింది.
పోలీసులు సుమారు రెండు గంటల పాటు 27 ప్రశ్నలు అడిగారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4 పాస్ పోర్టులు, 8 ఫోన్లు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే జోగి రమేష్ దర్యాప్తునకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆయన చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని అన్నారు. ఈ క్రమంలో నిందితులు సహకరించడం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్‌ను మరోసారి విచారణకు పిలుస్తామన్నారు.