మరో భారీ షాక్.. టీడీపీలోకి కందుకూరు ఎమ్మెల్యే.. నారా లోకేశ్‌తో భేటీ..!

by Disha Web Desk 16 |
మరో భారీ షాక్.. టీడీపీలోకి కందుకూరు ఎమ్మెల్యే.. నారా లోకేశ్‌తో భేటీ..!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఇంచార్జుల మార్పులు, చేర్పులతో ఆ పార్టీకి భారీగా షాక్‌లు తగులుతున్నాయి. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని ఇంచార్జులను నియమించారు. దీంతో ఆయా ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి రగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి భేటీ అయ్యారు. టీడీపీలో చేరికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు టికెట్ నిరాకరించారనే సంకేతాలు సీఎంవో నుంచి పంపారట. దీంతో ఆ పార్టీకి మానుగుంట గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. తాజాగా నారా లోకేశ్‌తో మానుగుంట మహీధర్ రెడ్డి భేటీ కావడంతో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదేగాని జరిగితే కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.


Next Story

Most Viewed