వైఎస్ వివేకా హత్యకేసు హైదరాబాద్ కు బదిలీ

by Dishafeatures2 |
వైఎస్ వివేకా హత్యకేసు హైదరాబాద్ కు బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ కడప జిల్లా సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసును హైదరాబాద్ కు బదిలీ చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కడప జిల్లా సెషన్స్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసు హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో వివేకా హత్యకేసుకు సంబంధించి 3 పెట్టెల్లో ఛార్జీషీట్లు, సాక్షుల వాంగ్మూలం తదితర విషయాలకు సంబంధించిన ఫైల్స్ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు సమర్పించనున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి నిందితులపై రెండు ఛార్జీషీట్లు నమోదయ్యాయి. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య వ్యవహారంతో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులకు సంబంధాలు ఉన్నట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరు, దర్యాప్తు అధికారులకు రాజకీయ బెదిరింపులు, వివేకా కుమార్తె విజ్ఞప్తి వంటి పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ కేసును హైదరాబాద్ కు బదిలీ చేయాలని ఇటీవలే ఆదేశాలిచ్చింది.




Next Story

Most Viewed