ఏపీలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు.. వివరాలివే..!

by Disha Web Desk 16 |
ఏపీలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు.. వివరాలివే..!
X

దివ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండల తీవ్రతలు పెరిగాయి. ప్రతిరోజూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకిపోతున్నారు. ఓ వైపు ఎండ తీవ్రత మరోవైపు వడగాల్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలతో అవస్తలు పడుతున్నారు. సూర్య తపానికి ప్రజలు విలవిలాడుతున్నరు. పగలు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో జనాలు ఎండవేడిమిని తట్టుకోలేకపోతున్నారు. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.4, ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2, వైఎస్సార్ కడప జిల్లా బలపనూరులో 43.8, అనకాపల్లి జిల్లా రావికతమతం-43.8, పల్నాడు జిల్లా రావిపాడు-43.8, నెల్లూరు జిల్లా కసుమూరు-43.7, మన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Read More..

చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాజీ మంత్రి సోదరుడు



Next Story

Most Viewed