సిద్ధం సభల మీద ఉన్న శ్రద్ధ ప్రాణాల మీద లేదు.. అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ

by Disha Web Desk 5 |
సిద్ధం సభల మీద ఉన్న శ్రద్ధ ప్రాణాల మీద లేదు.. అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మంచినీరు అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న విషయం సీఎం కు తెలుసా? అని, రాష్ట్ర ప్రజలకు కనీసం త్రాగునీరు అందించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం నిజంగా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించాడు. గుంటూరులో కలుషిత జలంతో డయేరియా, కలరా కేసులు నమోదు అవుతున్నాయని, లక్షలాది మంది ఆసుపత్రి పాలవుతున్నా స్పందికపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని మండిపడ్డారు.

ఇప్పటికే డయేరియాతో నలుగురు మృతి చెందారని, మరో ముగ్గురు కలరా వ్యాధితో బాధపడుతున్నారని, ఇవి మరింత ప్రభలకుండా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. సీఎం జగన్ కు సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమన్నారు. అధికారంలో ఉండే ఈ నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించాలని , వెంటనే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని లేఖ ద్వారా అచ్చెన్నాయుడు కోరారు.


Next Story

Most Viewed