Apలో బలపడుతున్న ప్రత్యేక హోదా డిమాండ్.. తెరపైకి జై ఆంధ్ర డెమోక్రటిక్ పార్టీ

by srinivas |
Apలో బలపడుతున్న ప్రత్యేక హోదా డిమాండ్.. తెరపైకి జై ఆంధ్ర డెమోక్రటిక్ పార్టీ
X
  • రాజకీయ పార్టీలు ఏకం కావాలి
  • బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని దేశ ప్రజలకు తెలియజేద్దాం
  • జై ఆంధ్ర డెమోక్రటిక్ నేతలు హరి, సేవకుమార్

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రత్యేక హోదా హామీకి తోమిదేళ్లు పూర్తయిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలై ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేదని జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫారం కార్యదర్శి అవధానుల హరి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి, సేవకుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 20వ తేదీ 2014న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఆమోదం సమయంలో పార్లమెంటులో ఆయన ఇచ్చిన హామీకి నేటికీ దిక్కులేదని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా అమలు జరిగి ఉంటే చట్టబద్ధంగా రాష్ట్రానికి నిధులు వచ్చేవని, నేడు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని నిధుల కోసం అభ్యర్థించే పరిస్థితి తప్పేదన్నారు. బీజేపీ నాయకులు హోదా ముగిసిన అధ్యాయం అంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా అన్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, తానే మెడ వంచారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం కేవలం అడుగుతూనే ఉంటానని ప్రజల విశ్వాసాన్ని జగన్ వమ్ము చేశారని విమర్శించారు.

ఇప్పటికైనా అధికార పక్షం, ప్రతిపక్షం, రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్ష డెలిగేషన్ ద్వారా ప్రధానమంత్రి వద్దకు వెళ్లాలన్నారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని దేశం దృష్టికి తీసుకువచ్చి జాతీయస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఆంధ్రుడు భాగస్వాములు కావాలని కోరారు.

Next Story

Most Viewed