స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్లు మార్చిన నూతన ప్రభుత్వం.. ఇకపై రాజముద్రతో

by Anjali |
స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్లు మార్చిన నూతన ప్రభుత్వం.. ఇకపై రాజముద్రతో
X

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇంతకు ముందు ఇచ్చే చిక్కీల కవర్లపై వైసీపీ రంగులతో పాటు జగన్ ఫొటోను కూడా ముద్రించి ఉండేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ చిక్కీల కవర్లపై రాజముద్రతో రూపొందించారు. అంతేకాకుండా వాటిపై ‘జగనన్న గోరుముద్ద’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మను తొలగించారు. ఇక రేపటి (జూన్ 13) నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో నూతన ప్రభుత్వం విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేయనున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవాళే పాఠశాలలు ప్రారంభం కావాల్సింది. కానీ నేడు చంద్రబాబు నాయుడు నాలుగో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కారణంగా ఏపీలోని పాఠశాలలకు ఒకరోజు సెలవు పొడగించడం జరిగింది.Next Story

Most Viewed