- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
‘అందుకే ఆ కంపెనీని వద్దన్నాం’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లులు కంపెనీ మళ్లీ వైజాగ్‌కు వస్తుందనీ హడావుడి చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ‘లులు’ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చే స్థలం విలువ రూ.1300 కోట్లు ఉందని, కానీ ఆ సంస్థ రూ.600 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే గతంలో ‘లులు’ కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పామన్నారు. రూ.99కే మద్యం ఇవ్వడం కాదు. నిత్యావసరాల రేట్లు తగ్గించాలని ఆయన అన్నారు. 2.50 లక్షల మంది వాలంటీర్లను తప్పించారని మద్యం షాపుల్లో పనిచేసే 15 వేల మంది సిబ్బందిని తీసేశారు అని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘మేము ఎన్నో మంచి పనులు చేశాం.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Advertisement
Next Story