కన్నీళ్లు పెట్టొద్దని ఆ రోజు చెప్పాను.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ స్పీచ్

by Rajesh |
కన్నీళ్లు పెట్టొద్దని ఆ రోజు చెప్పాను.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ స్పీచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విజయవాడలో నేడు ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీయే కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రకటించిన అనంతరం పవన్ సీబీఎన్ వద్దకు వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేశారు. అనంతరం మాట్లాడే డయాస్ వద్దకు చంద్రబాబును తీసుకువచ్చి ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబు నలిగిపోయారని.. ఆయనను జైల్లో చూశానన్నారు. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూశానని గుర్తు చేసుకున్నారు.

మంచిరోజులు వస్తాయి.. కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానని.. ఆ మంచి రోజులు ఇప్పుడు వచ్చాయన్నారు. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన పాలన అందించాలని కాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపారమైన అవగాహన, పెట్టుబడులను తీసుకొచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ప్రస్తుతం చాలా అవసరం అని పవన్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story

Most Viewed