- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
by Jakkula Mamatha |

X
దిశ ప్రతినిధి, కర్నూలు: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. ఇలాంటి ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లో బుధవారం వెలుగు చూసింది. కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్ధినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళన చెందిన విద్యార్ధినులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. కోపోద్రిక్తులైన వారు ఉదయం పాఠశాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉపాధ్యాయుడు రాగానే పాఠశాలలో బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, మండల విద్యాధికారి తైమూరు భాష, ఇతర అధికారులు వెంటనే గ్రామానికి చేరుకొని ఉపాధ్యాయని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story