ఆముదాలవలసలో కీచక టీచర్ సస్పెండ్ (వీడియో)

by Disha Web Desk 16 |
ఆముదాలవలసలో కీచక టీచర్ సస్పెండ్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో కీచక టీచర్ ఉధంతం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలో మైనర్ బాలికలలను ఉపాధ్యాయుడు నారాయణరావు వేధిస్తున్నారు. 6,8 చదువుతున్న బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం బాలికలల తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు నారాయణరావును నీలదీశారు. దీంతో ఉపాధ్యాయుడు నారాయణ రావును స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే ఇంక ఎక్కడ రక్షణ ఉంటుందని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ వృత్తికే కళంకం తెచ్చిన నారాయణరావుపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed