'జగన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలను అణిచి వేస్తున్నారు'

by Disha Web Desk 13 |
జగన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలను అణిచి వేస్తున్నారు
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపి అరాచక పాలన సాగిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యలు కొల్లు రవీంద్ర ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఐటీడీపీలో చింతకాయల విజయ్ యాక్టివ్‌గా ఉన్నందుకే కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు. సీఐడీ పోలీసులు విజయ్ ఇంటికెళ్లి చిన్నపిల్లల్ని సైతం బెదిరించారంటే అసలు వ్యవస్థ ఎటు వెళ్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చారు. చింతకాయల విజయ్ చేసిన తప్పేంటి? ప్రతిపక్షంగా ప్రజా సమస్యలు ఎత్తి చూడటం మా బాధ్యత..సమాధానం చెప్పలేక దాడులు... అరెస్టులు చేస్తారా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసే అధికారం ఎవరిచ్చారని అంకబాబు కేసులో కూడా కోర్టు పోలీసులను తప్పుపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అణగదొక్కుతున్నారు అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

దాడులు, హత్యలు చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు శూన్యం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. నాకు సంబంధం లేని హత్య కేసులో ఇరికించి నన్ను 53 రోజులు జైల్లో పెట్టారు.

శాసనమండలిలో బీద రవిచంద్ర యాదవ్ పై వైసీపీ సభ్యులు దాడికి ప్రయత్నించారు. మా పార్టీ మహిళా నేతలు వంగలపూడి అనిత, గౌతు శిరీష లపై వైసీపీ పేటీఎం కుక్కలు అసభ్యకర పోస్టులు పెట్టారు. వాటి పై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు ? ఉండవల్లి అనూష తనపై పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం ఎఫ్ఐఆర్ తీసుకునేందుకు కూడా పోలీసులు ముందుకు రాలేదు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు ను 73 ఏళ్ల వయసులో అక్రమ అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ లో పెట్టారు.

41ఏ నోటీసు ఇవ్వకుండా ఇచ్చారని కోర్టుకు అబద్దాలు చెప్పి చివాట్లు తిన్నారు. దాడులు, హత్యలు చేస్తున్న వైసీపీ నాయకుల పై మాత్రం చర్యలు శూన్యం అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుడ్డలూడదీసుకుని తిరిగిన మీ ఎంపీపై ఏం చర్యలు తీసుకున్నారు..? పరిపాలన గాలికొదిలి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు.

వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మరోవైపు మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. ఇంట్లో ఉన్న మహిళ పై అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారు అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు..

రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదు. చట్టాలు, రాజ్యాంగం మాత్రమే శాశ్వతం. జగన్ రెడ్డికి, పోలీసులకు, సీఐడీ చీప్ సునీల్ కుమార్‌కి చెబుతున్నాం మీరు చేస్తున్న పాపాలే మీకు శాపాలుగా తగులుతాయి అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మీ పోస్టింగ్‌ల వైసీపీ అకృత్యాలు వెనకేసుకొస్తే భవిష్యత్‌లో మూల్యం చెల్లించకతప్పదు అని హెచ్చరించారు. అప్పులతో పాలన సాగిస్తున్నారు, ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై సమాధానం చెప్పే పరిస్థితి లేదు.

అమరావతి రైతుల పాదయాత్ర, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారు. బీసీ ప్రతినిధి మండల్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు, అక్కడకి దళిత వైసీపీ నేతలు వచ్చినా విలువల్లేకుండా మండల్ విగ్రహ దిమ్మెను కూల్చారు. డా. సుధాకర్, అబ్దుల్ సలాం ఇలా బీసీల్ని, దళితుల్ని, మైనార్టీల్ని జగన్ రెడ్డి బలి తీసుకున్నారు. పదవులన్నీ తన సామాజిక వర్గం వారికి కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలను అణిచి వేస్తున్నారు. త్వరలోనే జగన్ రెడ్డి అరాచకాలకు మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.


Next Story

Most Viewed