YCP ఎంపీ బోస్ చెప్పింది అక్షరసత్యం.. టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web |
YCP ఎంపీ బోస్ చెప్పింది అక్షరసత్యం.. టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ధాన్యం కొనుగోలు పేరుతో భారీ స్కామ్ జరుగుతోందని వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ బోస్ వ్యాఖ్యలు అక్షర సత్యం అని సమర్ధించాడు. ''ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని ఎంపీ బోస్ గారు చెప్పింది అక్షరసత్యం. కోనసీమలోనే కాదు నెల్లూరులోనూ బస్తాకు రూ.300కు పైగా దోచేశారు. వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పుట్టి ముంచేశారు. మూడేళ్ల జగన్ పాలనలో ఒక్క నెల్లూరులోనే రూ. 3 వేల కోట్లు దోచుకున్నారు. ఈ భారీ స్కామ్‌పై సీఐడీ కాదు సీబీఐ లేదా జ్యుడిషియల్ ఎంక్వయిరీ జరిపితేనే నిజాలు నిగ్గుతేలుతాయి.'' అని ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Next Story