సీఎం జగన్ దాడిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు

by Disha Web Desk 12 |
సీఎం జగన్ దాడిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో వైసీపీ అధినేత, సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని దుండగులు జగన్ పై శనివారం రాత్రి రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో జగన్ ఎడమ కనుబొమ్మ పై గాయం అయింది. కాగా ఈ దాడిని టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. సీఎం పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలను, దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. నారా లోకేష్ మాత్రం జగన్ పై రాళ్ల దాడి పై సెటైరికల్ గా స్పందించారు. కాగా ఎన్నికల సమయంలో జగన్ పై దాడి సంచలనంగా మారగా.. వైసీపీ నేతలు టీడీపీ గూండాలే ఈ దాడి చేయించినట్లు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed